Venkaiah Naidu: ఢిల్లీలో ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య మనవరాలి రిసెప్షన్.. హాజరైన రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐ

VP Venkaiah Naidu Grand Daughter Niharika Reception Held in Delhi
  • వెంకయ్య మనవరాలు నిహారికకు రవితేజతో హైదరాబాద్‌లో వివాహం
  • ఢిల్లీలో వైభవంగా రిసెప్షన్
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలు నిహారిక రిసెప్షన్ ఢిల్లీలో వైభవంగా జరిగింది. వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె అయిన నిహారికకు హైదరాబాద్‌కు చెందిన రవితేజతో ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరినాలో వివాహం జరిగింది.

తాజాగా, ఢిల్లీలో రిసెప్షన్ నిర్వహించగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, పలువురు ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Venkaiah Naidu
Niharika
Raviteja
Marriage
Narendra Modi
Ram Nath Kovind

More Telugu News