Bandi Sanjay: కేసీఆర్‌కు సంస్కారం లేదు.. ఆ చావుడప్పేంది?: బండి సంజయ్

Bandi Sanjay fires on kcr on Chavu Dappu agitation
  • టీఆర్ఎస్ నేతల చావుడప్పు నిరసనలపై ఫైర్
  • కేసీఆర్ ఎదుటివారి చావును కోరుకుంటారన్న బండి
  • చావుడప్పు నిరసనలపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం?
  • నేడు ఢిల్లీలో అమిత్‌షాతో రాష్ట్ర నేతల భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనలో సంస్కారం ఇసుమంతైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చావుడప్పు కొట్టించడం ఏంటని ప్రశ్నించారు.

 కేసీఆర్ ఎప్పుడూ ఎదుటివారి చావునే కోరుకుంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న నిర్వహించిన చావుడప్పు నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు డబ్బులిచ్చి మనుషులను తీసుకొచ్చారని ఆరోపించిన బండి సంజయ్.. ఆ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలే కేసీఆర్ డౌన్ డౌన్ అని నినదించారని ఎద్దేవా చేశారు.

మరోవైపు, టీఆర్ఎస్ నేతలు చేపట్టిన చావుడప్పు నిరసన కార్యక్రమంపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రావాలంటూ బండి సంజయ్, డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు అర్వింద్, బాపురావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు లకు హోం మంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. అమిత్ షాతో నేడు వీరు భేటీ కానున్నట్టు సమాచారం.
Bandi Sanjay
TRS
Chavu Dappu
BJP

More Telugu News