Andhra Pradesh: మోదీ వేసిన పునాది అనాథగా మిగిలింది.. తిరుపతిని రాజధానిని చేయండి: కేంద్రమాజీ మంత్రి చింతా మోహన్

congress leader Chinta Mohan demand to announce tirupati as ap capital
  • సూళ్లూరుపేటలో పర్యటించిన చింతా మోహన్
  • ఏర్పేడు-రావూరు మధ్య 1.5 లక్షల ఎకరాల భూమి
  • అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే 13 జిల్లాలకూ అందుబాటు
  • దుగరాజపట్నం ఓడరేవు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు
ఏపీ రాజధాని విషయంలో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సూళ్లూరుపేటలో నిన్న పర్యటించిన ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

అమరావతిలో ప్రధాని వేసిన పునాది అనాథగా మిగిలిందన్నారు. ఆయన పరిపాలన అధ్వానంగా ఉందన్నారు. పీఎం కార్యాలయం నల్లధనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పైనా మోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ప్రభుత్వం పతనావస్థలో ఉందని విమర్శించారు. దుగరాజపట్నం ఓడరేవు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని మోహన్ ఆరోపించారు. అమరావతి రైతులకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందన్నారు.  

ఏర్పేడు-రావూరు మధ్య 1.5 లక్షల ఎకరాలు రాజధాని కోసం అందుబాటులో ఉందన్న డాక్టర్ మోహన్..  అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే 13 జిల్లాలకూ అందుబాటులో ఉంటుందన్నారు. కండలేరు, సోమశిల జలాశయాలతోపాటు తిరుపతికి ఏడు జాతీయ రహదారుల కలయిక, అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉందని వివరించారు. కాబట్టి తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయడం ఉత్తమమని సూచించారు.
Andhra Pradesh
Amaravati
Tirupati
Chinta Mohan

More Telugu News