అమెరికాలో రోడ్డు ప్రమాదం.. జనగామకు చెందిన కుటుంబానికి తీవ్ర గాయాలు.. 13 ఏళ్ల బాలుడి మృతి!
- 16 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడిన రాంచంద్రారెడ్డి కుటుంబం
- స్నేహితుడి బర్త్‌డే వేడుకలకు హాజరై వస్తుండగా ప్రమాదం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య, భర్త, కుమార్తె
తిరిగి వస్తున్న సమయంలో లాస్‌ఏంజెలెస్‌లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపారు. మద్యం మత్తులో కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఓ మహిళ వెనక నుంచి రాంచంద్రారెడ్డి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు వెనక సీట్లో కూర్చున్న రాంచంద్రారెడ్డి 13 ఏళ్ల కుమారుడు అర్జిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, రాంచంద్రారెడ్డి, ఆయన భార్య రజనీరెడ్డి, కుమార్తె అక్షితారెడ్డి (15) తీవ్రంగా గాయపడ్డారు.