Andhra Pradesh: ఏపీలో కొత్తగా 127 మందికి కరోనా నిర్ధారణ

AP Corona Status Report
  • గత 24 గంటల్లో 33,050 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 32 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 1,758 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 33,050 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 127 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 32 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 20, విశాఖ జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 180 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,477కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,546 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,59,311 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,758 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News

Andhra Pradesh
Corona Virus
Daily Report
Today Cases