TVS: సూపర్ హీరోల పేర్లతో టీవీఎస్ కొత్త స్కూటర్లు... ఎలా ఉన్నాయో చూశారా!

TVS launched new scooters inspired by Super Heroes
  • సూపర్ హీరోస్ స్ఫూర్తిగా సూపర్ స్క్వాడ్ ఎడిషన్
  • గతేడాది 3 వేరియంట్లు ప్రవేశపెట్టిన టీవీఎస్
  • తాజాగా స్పైడర్ మ్యాన్, థోర్ వేరియంట్ల ఆవిష్కరణ
  • ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర రూ.84,850
దేశీయ వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ తాజాగా తన పోర్ట్ ఫోలియోలో కొత్త స్కూటర్లను చేర్చింది. వీటిని ఎన్ టార్క్ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ లో భాగంగా తీసుకువచ్చింది. సూపర్ హీరోస్ స్ఫూర్తితో గతేడాది ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా వేరియంట్లను ప్రవేశపెట్టిన టీవీఎస్ తాజాగా స్పైడర్ మ్యాన్, థోర్ వేరియంట్లను పరిచయం చేసింది.
సూపర్ స్క్వాడ్ ఎడిషన్ కోసం టీవీఎస్ సంస్థ డిస్నీ ఇండియాతో చేతులు కలిపింది. కొత్తగా తీసుకువచ్చిన ఎన్ టార్క్ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ స్కూటర్లలో ఆర్టీ వైఫై టెక్నాలజీ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయం ఏర్పాటు చేశారు. భారత్ లో ఈ ఫీచర్ ను కలిగివున్న స్కూటర్లు ఇవే. ఢిల్లీలో వీటి ధర రూ.84,850 పేర్కొన్నారు. ఇది ఎక్స్ షోరూం ధర.
TVS
Scooters
Spider Man
Thor
Super Heroes

More Telugu News