Tamilnadu: ఇదే తమిళ ‘రాష్ట్ర గీతం’.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ‘లేచి నిలబడాల్సిందే’నంటూ ఆదేశాలు

Tamilnadu State Govt Declares Its State Anthem
  • ‘తమిళ్ థాయ్ వాళ్తూ’కు రాష్ట్ర గీతంగా హోదా
  • అన్ని విద్యాసంస్థలు, ఆఫీసుల్లో తప్పనిసరిగా ప్లే చేయాల్సిందే
  • దివ్యాంగులు తప్ప అందరూ లేచి నిలబడాల్సిందేనంటూ ఉత్తర్వులు
  • అది జస్ట్ పాట మాత్రమేనన్న మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం
తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ‘తమిళ్ థాయ్ వాళ్తూ’ పాటే రాష్ట్ర గీతమని ప్రకటన చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ‘రాష్ట్ర గీతాన్ని’ ఇకనుంచి ప్లే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర గీతం వచ్చేటప్పుడు దివ్యాంగులు తప్ప మిగతా వారంతా లేచి నిలబడాల్సిందేనని ఆదేశాల్లో పేర్కొంది.

ఇటీవల మద్రాసు హైకోర్టులో ‘తమిళ్ థాయ్ వాళ్తూ’ పాటపై పిటిషన్ దాఖలైంది. అది కేవలం ఓ పాట మాత్రమేనని, ఏ కార్యక్రమంలోనూ ఎవరూ లేచి నిలబడాల్సిన అవసరం లేదని పేర్కొంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది స్నాతకోత్సవం సందర్భంగా ఐఐటీ–మద్రాస్ లో ఆ పాటనూ ప్లే చేయలేదు. దీంతో వివాదం అలముకుంది. దీనిపై తమిళనాడు విద్యా శాఖ మంత్రి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం దానిని తాజాగా ‘రాష్ట్ర గీతం’గా ప్రకటించి.. అందరూ లేచి నిలబడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
Tamilnadu
Tamil Nadu
Tamil
State Anthem

More Telugu News