Eumillipes Persephone: ఈ జీవికి ఎన్ని కాళ్లో... ఆస్ట్రేలియాలో సరికొత్త జీవిని గుర్తించిన పరిశోధకులు

Australian researchers identifies thousand more legged millipede
  • ఆస్ట్రేలియాలో బయల్పడిన అత్యంత అరుదైన జీవి
  • జీవికి 1,306 కాళ్లు
  • ప్రపంచంలో ఇన్ని కాళ్లున్న జీవి ఇదేనంటున్న పరిశోధకులు
  • 60 మీటర్ల లోతులో జీవించే యుమిల్లిప్స్ పెర్సెఫోన్
కాళ్ల జెర్రి వంటి జీవులకు మహా అయితే 100 కాళ్లు ఉంటాయేమో! మిలపీడ్స్ గా పేర్కొనే కొన్ని జీవుల్లో అంతకంటే కొంచెం ఎక్కువ సంఖ్యలోనే కాళ్లు ఉంటాయి. కానీ ఆస్ట్రేలియా పరిశోధకులు కొత్తగా కనుగొన్న ఓ జీవికి వెయ్యికి పైగా కాళ్లున్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియాలోని బంగారు గనుల్లో దీన్ని గుర్తించారు.

95 మిల్లీమీటర్ల పొడవున్న ఈ జీవికి 1,306 కాళ్లు ఉండడం పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేసింది. భూమిపై ఇప్పటివరకు గుర్తించిన అత్యధిక కాళ్లు కలిగిన జీవి ఇదేనట. ఇది భూమిలో 60 మీటర్ల లోతులో దర్శనమిచ్చింది. ఓ గనిలో తవ్వకాలు జరుపుతుండగా కార్మికుల కంటపడింది. గ్రీకు పాతాళ దేవ పెర్సెఫోన్ పేరు కలిసేలా యుమిల్లిప్స్ పెర్సెఫోన్ అని దీనికి పేరుపెట్టారు.

అయితే దీనికి కళ్లు లేవు. వాసన, స్పర్శ ద్వారా పరిసరాలను గుర్తిస్తుందని, శిలీంధ్రాలను ఆహారంగా తీసుకుంటుందని ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు.
Eumillipes Persephone
Millipede
Australia
Thousand Legs

More Telugu News