ఇదే తమిళ ‘రాష్ట్ర గీతం’.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ‘లేచి నిలబడాల్సిందే’నంటూ ఆదేశాలు
- ‘తమిళ్ థాయ్ వాళ్తూ’కు రాష్ట్ర గీతంగా హోదా
- అన్ని విద్యాసంస్థలు, ఆఫీసుల్లో తప్పనిసరిగా ప్లే చేయాల్సిందే
- దివ్యాంగులు తప్ప అందరూ లేచి నిలబడాల్సిందేనంటూ ఉత్తర్వులు
- అది జస్ట్ పాట మాత్రమేనన్న మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం
ఇటీవల మద్రాసు హైకోర్టులో ‘తమిళ్ థాయ్ వాళ్తూ’ పాటపై పిటిషన్ దాఖలైంది. అది కేవలం ఓ పాట మాత్రమేనని, ఏ కార్యక్రమంలోనూ ఎవరూ లేచి నిలబడాల్సిన అవసరం లేదని పేర్కొంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది స్నాతకోత్సవం సందర్భంగా ఐఐటీ–మద్రాస్ లో ఆ పాటనూ ప్లే చేయలేదు. దీంతో వివాదం అలముకుంది. దీనిపై తమిళనాడు విద్యా శాఖ మంత్రి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం దానిని తాజాగా ‘రాష్ట్ర గీతం’గా ప్రకటించి.. అందరూ లేచి నిలబడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.