Kareena Kapoor: కరీనా కపూర్ తో పాటు మరో బాలీవుడ్ నటికి కరోనా పాజిటివ్

Kareena Kapoor Khan and Amrita Arora tested positive for Corona
  • కరీనా, అమృత అరోరాలకు కరోనా పాజిటివ్
  • ఇటీవల వీరిద్దరూ పలు పార్టీలకు హాజరైన వైనం
  • కోవిడ్ జాగ్రత్తలను అస్సలు పట్టించుకోని నటీమణులు
బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్, అమృత అరోరాలకు కరోనా సోకింది. వీరికి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ఇటీవలి కాలంలో కోవిడ్ నిబంధనలను గాలికొదిలేసి వీరిద్దరూ పలు పార్టీలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరు కోవిడ్ బారిన పడ్డారు. వీరిద్దరికీ కాంటాక్టులోకి వచ్చిన వారందరూ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది.

బాలీవుడ్ నటి మలైకా అరోరా సోదరే అమృతా అరోరా. వీరు ముగ్గురూ ఎంతో స్నేహంగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక పార్టీలో సందడి చేస్తూనే ఉంటారు. వీరి పార్టీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మరోవైపు కోవిడ్ బారిన పడిన వీరిద్దరూ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.
Kareena Kapoor
Amrita Arora
Bollywood
Corona Virus
Positive

More Telugu News