Jagan: సీఎం జగన్ ను హతమార్చేందుకు ఓ కులం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలపై బుద్ధా వెంకన్న స్పందన

YSRCP leaders are waiting for Jagan arrest says Budda Venkanna
  • నారాయణస్వామి వ్యాఖ్యలు వైసీపీలోని వర్గపోరుకు నిదర్శనమన్న వెంకన్న
  • జగన్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా? అని వైసీపీవారే ఎదురు చూస్తున్నారు
  • ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై జగన్ కక్షసాధింపులు మానుకోవాలి
సీఎం జగన్ ను హతమార్చేందుకు ఓ కులం ప్రయత్నిస్తోందని మంత్రి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ... ఈ వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. వైసీపీలో కొనసాగుతున్న వర్గపోరుకు ఈ వ్యాఖ్యలు నిదర్శనమని చెప్పారు. సీఎం జగన్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా? తమకు సీఎం సీటు ఎప్పుడు దక్కుతుందా? అని వైసీపీ వారే ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఏపీ సీఐడీ అధికారులు కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. రాధాకృష్ణపై జగన్ కక్ష సాధింపులు మానుకోవాలని... వైసీపీలోని ఇంటి దొంగలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
Jagan
YSRCP
Budda Venkanna
Telugudesam

More Telugu News