Andhra Pradesh: ఏపీలో కొత్తగా 160 కరోనా కేసుల నమోదు

AP Corona Bulletin
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 30,859 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 160 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 37 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 29, కృష్ణా జిల్లాలో 19 కేసులు వెల్లడయ్యాయి. ప్రకాశం, కడప, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 201 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,868 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,490 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,912 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,466కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Bulletin

More Telugu News