తిరుపతిలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు: డీహెచ్ఎంఓ
- ఏపీలో ఒమిక్రాన్ కలకలం
- విజయనగరంలో ఒకరికి నిర్ధారణ
- తిరుపతిలోనూ ఒమిక్రాన్ కేసు అంటూ ప్రచారం
- వదంతులు నమ్మొద్దని డీహెచ్ఎంఓ సూచన
తిరుపతిలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు వస్తున్న వదంతులను నమ్మవద్దని డీహెచ్ఎంఓ శ్రీహరి తెలిపారు. తిరుపతిలో నమోదైంది కరోనా పాజిటివ్ కేసు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపామని, ఒమిక్రాన్ అని ఇంకా నిర్ధారణ కాలేదని వెల్లడించారు. దీనిపై ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని అన్నారు.