omicron: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కూ చేరిన ఒమిక్రాన్.. తొలి కేసు నమోదైంద‌ని అధికారుల వెల్ల‌డి

first omicron case in ap
షార్ట్స్‌లో చూడండి
ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌రపెడుతోన్న క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భార‌త్‌లోకూ ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. అధికారులు ఎన్ని చ‌ర్యలు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికే దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్ర‌క‌ట‌న చేశారు.  

ఐర్లాండ్‌ నుంచి వచ్చిన విజ‌య‌న‌గ‌రం వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు తెలిపారు. 34 ఏళ్ల వ్యక్తి  ఐర్లాండ్‌ నుంచి ముంబైకి చేరుకున్నాడని, అక్కడ ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష చేయించుకున్నాడ‌ని అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అయితే ఆ స‌మ‌యంలో ఆయనకు నెగిటివ్ అని తేలింద‌ని, విజయనగరంలో మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని వివ‌రించారు.  అతడి శాంపిళ్లను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించ‌గా ఒమిక్రాన్ గా నిర్ధార‌ణ అయింద‌ని స్ప‌ష్టం చేశారు.   
 
           
Go Back to Shorts
omicron
Andhra Pradesh
Corona Virus

More Telugu News