ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్.. ప్రభుత్వం బిట్‌కాయిన్లు పంచుతోందంటూ స్కామ్ లింక్ పోస్ట్!
- బిట్ కాయిన్‌ను ప్రభుత్వం అధికారికం చేసిందని పోస్టు
- దేశంలోని ప్రతి ఒక్కరికీ 500 కాయిన్ల చొప్పున పంచుతోందంటూ స్కామ్ లింక్
- ఆ తర్వాత కాసేపటికే ఖాతా పునరుద్ధరణ
- ఆ పోస్టు పట్టించుకోవద్దన్న పీఎంవో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా కొంతసేపు హ్యాక్ అయిందని, ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఖాతాను పునరుద్ధరించినట్టు పీఎంఓ ఇండియా ఈ తెల్లవారుజామున ట్వీట్ చేసింది. హ్యాక్ అయిన సమయంలో షేర్ అయిన ట్వీట్లను పట్టించుకోవద్దని సూచించింది.