'ఆర్ఆర్ఆర్' విడుద‌ల‌వుతున్న వేళ ఎన్టీఆర్ పాత్ర‌పై కొమురం భీం మునిమనవడి స్పంద‌న‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆర్ఆర్ఆర్' విడుద‌ల‌వుతున్న వేళ ఎన్టీఆర్ పాత్ర‌పై కొమురం భీం మునిమనవడి స్పంద‌న‌

komram sone rao on rrr
  • మొద‌ట్లో ఎన్టీఆర్ క‌న‌ప‌డిన తీరుపై వివాదం
  • ఇప్పుడు సానుకూలంగా స్పందిస్తోన్న వార‌సులు
  • కొమురం భీం పోరాటంపై సినిమా రావ‌డం సంతోష‌మ‌న్న సోనేరావ్
  • రాజ‌మౌళికి ధన్యవాదాలని వ్యాఖ్య
రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమురం భీంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ప‌రిచ‌యం చేస్తూ ఆ సినిమా బృందం మొద‌ట్లో విడుద‌ల చేసిన వీడియోలో తార‌క్ క‌న‌ప‌డిన తీరుపై కొంద‌రు అభ్యంత‌రాలు తెలిపారు. ఆ వివాదంపై అప్ప‌ట్లోనే రాజ‌మౌళి స్పందిస్తూ ఈ సినిమాలో కొమురం భీంను అత్యద్భుతంగా చూపిస్తాన‌న్నారు. ప్ర‌స్తుతం కొమురం భీం వార‌సులు కూడా ఈ సినిమా విష‌యంలో సానుకూలంగానే ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న వేళ  ఈ సినిమాపై కొమురం భీం మునిమనవడు కొమురం సోనే రావ్ స్పందించారు. కొమురం భీం పోరాటానికి సినిమా రూపం ఇవ్వడం సంతోషంగా ఉంద‌ని ఆయ‌న చెప్పారు. రాజ‌మౌళి కొమురం భీం చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తున్నారని, ఆయ‌న‌కు ధన్యవాదాలు చెబుతున్నామ‌ని సోనే రావ్ తెలిపారు.

కాగా, కొన్ని నెల‌ల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ క‌న‌ప‌డిన తీరుపై సోనే రావ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ఈ అంశం చ‌ర్చ‌నీయాంశ‌మైంది కూడా. ఇప్పుడు మాత్రం ఆయ‌న రాజ‌మౌళికి కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డం గ‌మ‌నార్హం.
RRR
Rajamouli
Ramcharan

More Telugu News