Chiranjeevi: 'భీష్మ' దర్శకుడికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్!

Venky Kudumula movie update
చిరంజీవి ఇటీవల కాలంలో వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నారు. కంటెంట్ బాగుంటే చాలు ఆయన యువ దర్శకులకు కూడా ఓకే చెప్పేస్తున్నారు. దాంతో ఆయనను కలిసే యంగ్ డైరెక్టర్ల జాబితా పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వెంకీ కుడుముల కూడా ఆయనకి ఒక కథను వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి.

ఆయన వినిపించిన ఆ కథకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది తాజా సమాచారం. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనుండగా, ఒక ముఖ్యమైన పాత్రలో వరుణ్ తేజ్ కూడా కనిపించనున్నట్టు చెబుతున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని అంటున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమవుతుందని చెబుతున్నారు.

'ఛలో' .. 'భీష్మ'  హిట్లతో యూత్ నుంచి మంచి మార్కులను కొట్టేసిన వెంకీ కుడుముల, మూడో సినిమానే చిరంజీవితో చేసే ఛాన్స్ కొట్టేయడం విశేషం. వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఇటీవల 'గాడ్ ఫాదర్' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన చిరంజీవి, 'భోళా శంకర్' .. 'వాల్తేర్ వీర్రాజు' ప్రాజెక్టులను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.  
Chiranjeevi
Venky Kudumula
Tollywood

More Telugu News