పీఆర్సీ కచ్చితంగా ప్రకటిస్తాం: సజ్జల స్పష్టీకరణ

07-12-2021 Tue 21:32
  • డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల నిరసన బాట
  • ఉద్యోగులపై తమ ప్రభుత్వానికి ప్రేమ ఉందన్న సజ్జల 
  • సీఎం జగన్ మాట నిలబెట్టుకుంటారని ఉద్ఘాటన
Sajjala stated their govt will announce PRC
పీఆర్సీ సహా 71 డిమాండ్ల సాధన కోసం ఏపీ ఉద్యోగులు నిరసన బాట పడుతుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. పీఆర్సీని కచ్చితంగా ప్రకటిస్తామంటూ వెల్లడించారు. ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో భాగమని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది వారేనని, అలాంటి ఉద్యోగులపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటుందని, అంతేతప్ప కోపం ఎందుకుంటుందని అన్నారు. సీఎం జగన్ హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని కచ్చితంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.