బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న.. కేసీఆర్ ను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని వ్యాఖ్య!
- ఢిల్లీలో తరుణ్ ఛుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న
- కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్
- తెలంగాణలో అత్యంత మోసకారి కేసీఆర్ అన్న మల్లన్న
అనంతరం మీడియాతో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ... చింతపండు నవీన్ ను ప్రజలు తీన్మార్ మల్లన్న చేశారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని అన్నారు. తెలంగాణలో అత్యంత మోసకారి కేసీఆర్ అని మండిపడ్డారు. తనపై 38 కేసులు పెట్టి కేసీఆర్ సాధించిందేంటని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే తన ధ్యేయమని చెప్పారు. బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపారు.