Andhra Pradesh: ఏపీలో మరో 122 మందికి కరోనా పాజిటివ్

AP Corona Media Report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో 18,788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 31 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 18, గుంటూరు జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి. ప్రకాశం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 213 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,852 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,57,369 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,030 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,453కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Report
Today Cases
Corona Deaths

More Telugu News