బాలయ్య సినిమాలో హాట్ హీరోయిన్!
- భారీ హిట్ కొట్టిన 'అఖండ'
- బాలకృష్ణ ఫ్యాన్స్ ఖుషీ
- నెక్స్ట్ మూవీకి సన్నాహాలు
- విలన్ పాత్రలో అర్జున్
బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా శ్రుతి హాసన్ ను తీసుకున్నారు. మరో కథానాయికగా రాయ్ లక్ష్మిని ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం.
హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రాయ్ లక్ష్మి, గతంలో బాలకృష్ణతో కలిసి 'అధినాయకుడు' సినిమాలో కనువిందు చేసింది. మళ్లీ ఇంతకాలానికి ఆమెను ఈ సినిమా కోసం తీసుకున్నారని అంటున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగుకి వెళుతున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా అర్జున్ పేరు వినిపిస్తోంది.