Boyapati Sreenu: బోయపాటి నెక్స్ట్ మూవీ బన్నీతోనే!

Allu Arjun in Boyapati movie
  • ఈ నెల 2న విడుదలైన 'అఖండ'
  • రెండు రోజుల్లోనే 40 కోట్ల గ్రాస్
  • వీకెండ్ లో పెరగనున్న వసూళ్లు
  • గీతా ఆర్ట్స్ లో నెక్స్ట్ మూవీ

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేసిన 'అఖండ' సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో బాలకృష్ణతో కలిసి బోయపాటి హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు ఏ థియేటర్ దగ్గర చూసినా 'అఖండ' సందడినే కనిపిస్తోంది.
ఈ నెల 2వ తేదీన విడుదలైన ఈ సినిమా, 2 రోజులలోనే 40 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిందని చెబుతున్నారు.

వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింతగా  పెరగనున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటి తదుపరి సినిమా ఏ హీరోతో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తోనే ఉండనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే ఈ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News