రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై స్పందించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

03-12-2021 Fri 22:17
  • కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏపీలో పేర్లు మార్చుతున్నారని ఫిర్యాదు
  • కేంద్రానికి రఘురామకృష్ణరాజు లేఖ
  • ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు స్మృతీ ఇరానీ వెల్లడి
Smriti Irani explains on Raghurama Krishnaraju complaint
కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏపీలో పేర్లు మార్చుతున్నారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే పథకాలకు పేర్లు మార్చడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని లేఖ రాసినట్టు స్మృతీ ఇరానీ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని అటు ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూడా తెలియజేశామని ఆమె పేర్కొన్నారు.

పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏపీలో జగనన్న, వైఎస్సార్ పేర్లు పెట్టుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ పథకాలకు తాము కేటాయించిన నిధులకు లెక్కలు చూపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు తెలిపారు.