Salman Khan: సల్మాన్ ఖాన్ కు కత్రిన వివాహ ఆహ్వానం పంపిందా?.. సల్మాన్ గారాల చెల్లెలు అర్పిత సమాధానం ఇదీ!

Katrina Kaif Not Invited Salaman and His Sisters to Marriage
  • ఆహ్వానం పంపారంటూ కథనాలు
  • అర్పిత, అల్విరాలు పెళ్లికి వెళ్తారంటూ వార్తలు
  • తమకే ఆహ్వానమూ అందలేదన్న అర్పిత
కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ అతి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. జైపూర్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే అతిథులకు సంబంధించిన లిస్టు రెడీ చేసుకుని వారికి కోడ్ నేమ్ లతో ఆహ్వానాలూ పంపినట్టు ప్రచారం జరుగుతోంది. అదే కోవలో మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్, అతడి సోదరీమణులకూ ఇన్విటేషన్ పంపారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ వార్తలపై సల్మాన్ గారాల చెల్లెలు అర్పితా ఖాన్, ఫ్యామిలీ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని అర్పితా ఖాన్ స్పష్టం చేసింది. సల్మాన్ ఫ్యామిలీకి కత్రినా దగ్గర్నుంచి ఎలాంటి ఆహ్వానాలూ రాలేదని కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. సల్మాన్ కుగానీ, అర్పిత, అల్విరాలకుగానీ ఇన్విటేషన్ రాలేదన్నారు. కత్రిన పెళ్లికి హాజరవుతారన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. కత్రిన అంటే సల్మాన్ ఖాన్ కు అభిమానమని, ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడని తెలిపారు. వివాహానంతరం టైగర్ 3 షూటింగ్ లో సల్మాన్ తో జత కడుతుందని చెప్పారు.

Salman Khan
Bollywood
Katrina Kaif
Wedding
Vicky Kaushal

More Telugu News