Cricket: గుండె బద్దలవుతోంది: రోహిత్ శర్మ

Rohit Sharma First Response On Players Released For Auction
  • స్టార్ ప్లేయర్లను వదిలేయడం పట్ల ముంబై కెప్టెన్ విచారం
  • వారంతా గన్ ప్లేయర్స్ అంటూ కామెంట్
  • ఆ నిర్ణయం గుండెకు భారమయ్యేదేనన్న హిట్ మ్యాన్
ఐపీఎల్ మెగా వేలానికి టైం దగ్గరపడింది. ఇప్పటికే జట్లన్నీ తమకు కావాల్సిన ప్రధాన ఆటగాళ్లను అంటిపెట్టుకుని మిగతా వాళ్లను వేలానికి రిలీజ్ చేశాయి. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్ లను అంటిపెట్టుకుని.. ఫైర్ క్రాకర్స్ లాంటి ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ లను విడుదల చేసింది. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.

ఈ ఏడాది రిటెన్షన్ ముంబై ఇండియన్స్ కు సవాలుతో కూడుకున్న పని అని రోహిత్ అన్నాడు. ‘గన్ ప్లేయర్స్’ను వదులుకోవడం గుండెని బద్దలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘మాకు చాలా చాలా మంచి ఆటగాళ్లున్నారు. వాళ్లంతా గన్ ప్లేయర్లు. ఎవరిని రిటెయిన్ చేసుకోవాలి? ఎవరిని విడుదల చేయాలి? అన్నది కఠిన నిర్ణయం’’ అని చెప్పాడు.

ఫ్రాంచైజీ కోసం వారంతా ఎంతో అద్భుతంగా ఆడారని, ఎన్నెన్నో చెరిగిపోని గుర్తులను అందించారని పేర్కొన్నాడు. అంత మంచి జ్ఞాపకాలందించిన వారిని వదిలేయడమంటే గుండెకు భారమైన పనేనన్నాడు. నాతో సహా నలుగురు ఆటగాళ్ల కోర్ టీంతో పాటు ఓ మంచి టీమ్ ను తయారు చేసుకోగలిగామని రోహిత్ చెప్పాడు. ఇప్పుడు తమ ముందున్న లక్ష్యం వేలంలో మంచి ఆటగాళ్లను ఎంచుకోవడమేనన్నాడు. ఈ వేలంలో మంచి కోర్ ఆటగాళ్లను పొందుతామన్న నమ్మకం ఉందని తెలిపాడు.
Cricket
IPL
Mumbai Indians
Rohit Sharma

More Telugu News