Telangana: ఎంత కష్టమొచ్చిందో.. పేగు తెంచుకుపుట్టిన బిడ్డను నడుముకు కట్టుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి

Mother Died By Suicide Tied Her 9 month Old Kid to Waist
  • నీటి కుంటలో శవమై తేలిన తల్లీబిడ్డ
  • కుటుంబ సభ్యుల వేధింపులే కారణమంటున్న స్థానికులు
  • భర్తతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిన భార్య
  • రెండు రోజులుగా వారి కోసం గాలింపు
ఏం కష్టమొచ్చిందో ఏమోగానీ.. తన తొమ్మిది నెలల బిడ్డను నడుముకు కట్టుకుని కుంటలోకి దూకి ఉసురు తీసుకుంది. ఈ విషాద ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ లో జరిగింది. తిమ్మాజీపేట మండలం గుమ్మకొండకు చెందిన సరిత (20)కు మిడ్జిల్ కు చెందిన శ్రీశైలంతో రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి తొమ్మిది నెలల వయసున్న పాప ఉంది. భర్తతో గొడవ నేపథ్యంలో ఆమె పాపను తీసుకుని రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

వారి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గాలింపు చేపట్టగా ఇవాళ ఉదయం మిడ్జిల్ శివారులోని నీటి కుంటలో వారిద్దరి మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. దీంతో వారు వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమందించారు. చిన్నారిని నడుముకు కట్టుకుని సరిత చనిపోవడం అక్కడి వారిని కదిలించింది. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకే సరిత ఆత్మహత్య చేసుకుందని స్థానికులు పోలీసులకు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
mahabub Nagar
Midgil
Suicide
Crime News

More Telugu News