అభిమానులు చేసిన రచ్చకు 'అఖండ' సినిమా షోను ఆపి, వార్నింగ్ ఇచ్చిన పోలీసులు!
- ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'అఖండ'
- విదేశాల్లో సైతం కొనసాగుతున్న 'అఖండ' ఫీవర్
- ఆస్ట్రేలియాలో థియేటర్లో రచ్చ చేసిన బాలయ్య అభిమానులు
సినిమా థియేటర్లో బాలయ్య అభిమానులు చేసిన రచ్చకు... చివరకు పోలీసులు వచ్చి సినిమా షోను ఆపేశారు. ఇది ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి బాలయ్య అభిమానులు రచ్చరచ్చ చేశారు. దీంతో థియేటర్ యజమానులు షోని ఆపేసి... మైకులో వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత షో మళ్లీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కూడా బాలయ్య అభిమానులు ఏ మాత్రం తగ్గకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారట. మళ్లీ షోను ఆపేసి వార్నింగ్ ఇచ్చి వెళ్లారట.