Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న మార్కెట్లు ముగిసిన తర్వాత వెలువడిన జీడీపీ డేటా ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. దీంతో ఈరోజు వారు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 620 పాయింట్లు లాభపడి 57,684కి పెరిగింది. నిఫ్టీ 184 పాయింట్లు పుంజుకుని 17,167 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.73%), యాక్సిస్ బ్యాంక్ (3.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.19%), టెక్ మహీంద్రా (3.04%), మారుతి సుజుకీ (2.66%).

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.58%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.45%), సన్ ఫార్మా (-1.14%), భారతి ఎయిర్ టెల్ (-1.06%), టైటాన్ (-0.57%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News