'క్యాలీఫ్లవర్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

24-11-2021 Wed 11:26
  • హాస్యప్రధానమైన 'క్యాలీఫ్లవర్'
  • ద్విపాత్రాభినయంతో సంపూ
  • దర్శకుడిగా ఆర్కే మలినేని
  • ఈ నెల 26వ తేదీన విడుదల
Cauliflower lyrical song released
హాస్యభరితమైన కథలను ఎంచుకోవడంలో సంపూర్ణేశ్ బాబు తనదైన మార్కు చూపిస్తూ ఉంటాడు. కమెడియన్ గా ఇతర సినిమాలతోనూ బిజీ కావాలనే ఆరాటం చూపకుండా, తాపీగా హీరోగానే తన సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'క్యాలీ ఫ్లవర్' ఈ నెల 26వ తేదీన థియేటర్లకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను అల్లరి నరేశ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. "కిల్ బిల్ కళాకార్ సంపూర్ణేషుడు .. జిల్ జిల్ జిగా జిగా మండే సూర్యుడు .. హల్ చల్ చేస్తున్నాడు ఈ ఆండ్రాయుడు .. క్రేజీ క్యాలీఫ్లవర్ నామధేయుడు" అంటూ ఈ పాట జోరుగా హుషారుగా సాగుతోంది.

ప్రజ్వల్ క్రిష్ స్వరపరిచిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా సాకేత్ ఆలపించాడు. ఈ పాటకి శశి మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. ఆశాజ్యోతి నిర్మించిన ఈ సినిమాకి ఆర్కే మలినేని దర్శకత్వం వహించాడు. సంపూ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాతో, ఆయన కెరియర్ మరింత పుంజుకుంటుందేమో చూడాలి.