Venkaiah Naidu: ఈ ఇడ్లీల రుచి అమోఘం.. విశాఖ యువకుడి ‘స్పెషల్’ ఇడ్లీలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య ఫిదా

Venkaiah Naidu Praises Vishakha Youth Millets Idly
  • సిరిధాన్యాలతో ఇడ్లీలు చేస్తున్న సుధీర్ అనే యువకుడు
  • యువత ఆహారంగా తీసుకోవాలని వెంకయ్య సూచన
  • సంప్రదాయ ఆహారాన్ని ప్రోత్సహించాలని పిలుపు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ స్పెషల్ డిష్ ను పరిచయం చేశారు. విశాఖపట్నంలో చిట్టెం సుధీర్ అనే యువకుడు చిన్న తోపుడు బండి ద్వారా తయారు చేస్తున్న టేస్టీ టేస్టీ స్పెషల్ ఇడ్లీని జనానికి తెలియజేశారు. రాగి, ఇతర సిరిధాన్యాలతో వండిన ఇడ్లీలను ఆయన ఎంతో మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువత ఇలాంటి ఆహారం తీసుకోవాలని సూచించారు.


‘‘ఈరోజు ఉదయం ‘వాసెనపోలి’ వారి రాగి, జొన్న, ఇతర సిరిధాన్యాలతో చేసిన అల్పాహారాన్ని ఆరగించాను. చాలా రుచిగా అనిపించాయి. ఆరోగ్యాన్నిచ్చే ఇలాంటి ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ముఖ్యంగా యువత ఈ ఫుడ్ ను తిని ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. సిరిధాన్యాలతో సాంప్రదాయ పద్ధతిలో ఇలాంటి మంచి టిఫిన్ ను అందిస్తున్న విశాఖపట్నం యువకుడు చిట్టెం సుధీర్ కు అభినందనలు. వినూత్న ఆలోచనలతో మన సంప్రదాయ ఆహారపద్ధతులను కాపాడుకునేందుకు యువత చొరవ తీసుకోవాలి’’ అని ట్వీట్ చేశారు.

Venkaiah Naidu
Vice President Of India
Millets Idly
Vizag
Visakhapatnam District
Visakhapatnam

More Telugu News