ఏపీ సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖాస్త్రం

CPI Ramakrishna shot a letter to CM Jagan
  • సర్పంచ్ ల అధికారాలు, నిధులపై లేఖ
  • పంచాయతీ అభివృద్ధి ఎలా సాధ్యమన్న రామకృష్ణ
  • ఇదేనా అధికార వికేంద్రీకరణ అంటూ విమర్శలు
  • సర్పంచ్ లు ఆందోళనకు సిద్ధమవుతున్నారని వెల్లడి
పంచాయతీ సర్పంచ్ ల అధికారాలపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. సర్పంచ్ లకు నిధులు, విధులు లేకుండా చేస్తే పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని రామకృష్ణ ప్రశ్నించారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం సరికాదని తెలిపారు.

సర్పంచ్ లకు అధికారాలు లేకుండా చేయడమే అధికార వికేంద్రీకరణా? అని నిలదీశారు. ప్రభుత్వం తీసుకున్న పంచాయతీల నిధులు రూ.3,450 కోట్లు తిరిగివ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని రాష్ట్రంలోని సర్పంచ్ లు నిరసనలకు దిగే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
Go Back to Shorts
CPI Ramakrishna
CM Jagan
Panchayat Sarpanch
Powers and Funds
Andhra Pradesh

More Telugu News