మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

21-11-2021 Sun 18:59
  • కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
  • ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన టీమిండియా
  • నేటి మ్యాచ్ కు రాహుల్, అశ్విన్ లకు విశ్రాంతి
  • ఇషాన్ కిషన్, చహల్ లకు స్థానం 
Team India won the toss and opted batting
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు చివరి మ్యాచ్ జరగనుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ పోరుకు వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే 2-0తో సిరీస్ చేజిక్కించుకున్న భారత జట్టు ప్రాధాన్యం లేని ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లకు విశ్రాంతినిస్తున్నామని, ఈ మ్యాచ్ లో వారి స్థానాల్లో ఇషాన్ కిషన్, యజువేంద్ర చహల్ ఆడతారని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.

ఇక న్యూజిలాండ్ జట్టుకు ఈ మ్యాచ్ లో స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ నాయకత్వం వహించనున్నాడు. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పేసర్ టిమ్ సౌథీ నేటి మ్యాచ్ లో ఆడడంలేదు.