Pawan Kalyan: వరద నష్టంతో రైతులు ఏడుస్తుంటే ఇసుక అమ్ముతామంటూ ప్రభుత్వ ప్రకటనలా?: పవన్ కల్యాణ్

Pawan Kalyan fires on AP Govt over Sand advertisement
  • ఏపీలో వరదలు
  • భారీగా నష్టం
  • ఇసుకపై ఏపీ ప్రభుత్వం పత్రికా ప్రకటన
  • ఇంగిత జ్ఞానం ఉందా అంటూ పవన్ ఆగ్రహం
అందరికీ అందుబాటులోకి ఇసుక అంటూ ఏపీ ప్రభుత్వం పత్రికా ప్రకటనలు ఇవ్వడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వరద నష్టంతో బాధపడుతుంటే ఇసుక అమ్ముతామంటూ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోందని మండిపడ్డారు.

వరద కారణంగా పచ్చని పంట పొలాల్లో ఇసుక మేట వేసిందని, రైతులు ఏడుస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి తరుణంలో ఇసుక అమ్మకాలపై పత్రికా ప్రకటనలు ఇచ్చిన వైసీపీ సర్కారును ఏమనాలి? ఈ ప్రభుత్వానికి కొంచెమైనా జ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు.
Pawan Kalyan
AP Govt
Sand Ad
Floods
Andhra Pradesh

More Telugu News