Ramcharan: చరణ్ .. కియారాలను లవ్ లోకి దింపిన శంకర్!

  • శంకర్ దర్శకత్వంలో చరణ్
  • కథానాయికగా కియారా అద్వాని
  • సంగీత దర్శకుడిగా తమన్
  • ముఖ్యమైన పాత్రలో ఇషా గుప్తా
Shankar movie second scheduel started

చరణ్ - కియారా అద్వాని జంటగా శంకర్ ఒక పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూణేలో నిర్వహించారు. 15 రోజుల పాటు అక్కడ ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారు.

ఆ తరువాత షెడ్యూల్ ను ఈ రోజున మొదలుపెట్టారు. హైదరాబాదు .. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ మొదలైంది. ఈ షూటింగుకు చరణ్ తో కియారా కూడా హాజరైంది. ఈ షెడ్యూల్ అంతా కూడా ఈ ఇద్దరి కాంబినేషన్లో లవ్ సీన్స్ ను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఆ సీన్స్ నే ప్లాన్ చేశారని అంటున్నారు.

విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి .. ఇషా గుప్తా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా చరణ్ కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

More Telugu News