తమిళనాడు సీఎం స్టాలిన్ అల్లుడు ఇంటికి బాంబు బెదిరింపు!
- శబరీశన్ ఇంట్లో బాంబు పెట్టినట్టు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్
- జాగిలం, మెటల్ డిటెక్టర్లతో ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు
- ఇంట్లో లభ్యం కాని బాంబు
దీంతో ఉలిక్కి పడిన పోలీసులు హుటాహుటిన శబరీశన్ ఇంటికి జాగిలాలు, మెటల్ డిటెక్టర్లతో చేరుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఇంట్లో బాంబు లభ్యం కాకపోవడంతో, అది తప్పుడు కాల్ అని నిర్ధారించారు. ఆ తర్వాత ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్లే ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తమ విచారణలో ఒక నిర్ధారణకు వచ్చారు.