Andhra Pradesh: ఏపీలో గత 24 గంటల్లో 231 కరోనా కేసుల నమోదు

AP Corona cases and deaths
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు నిర్వహించగా, 231 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 37, తూర్పు గోదావరి జిల్లాలో 36, గుంటూరు జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 362 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,68,718 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,51,082 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,233 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,403కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths

More Telugu News