CM Jagan: పాతపట్నం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

CM Jagan attends Pathapatnam MLA Reddy Santhi daughter wedding reception
  • రుచిత్ తో రెడ్డి వేదిత వివాహం
  • పాతపట్నంలో రిసెప్షన్
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
  • సీఎం వెంట తమ్మినేని, ధర్మాన తదితరులు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె రెడ్డి వేదిత వివాహం రుచిత్ తో జరిగింది. వీరి పెళ్లి రిసెప్షన్ నేడు పాతపట్నంలో నిర్వహించగా, ఈ విందు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. వధూవరులు వేదిత, రుచిత్ లకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

ఈ రిసెప్షన్ కు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తదితరులు హాజరయ్యారు. కాగా, ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వేదిత ఐఏఎస్ అధికారిణి. 2014 సివిల్స్ లో ఆమె 71వ ర్యాంకు సాధించారు.

  • Loading...

More Telugu News