Samantha: నీ లాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం.. సమంత ఎమోషనల్ పోస్ట్

Sam Emotional post On Her Friend Birthday
  • సామ్ స్నేహితురాలు డాక్టర్ మంజుల బర్త్ డే
  • పార్టీకి హాజరైన హీరోయిన్
  • ఫొటోలు షేర్ చేసి.. నీ కన్నా నిజమైన స్నేహితురాలెవరంటూ కామెంట్

సమంత మరోసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఇన్ స్టాలో భావోద్వేగ భరితమైన కామెంట్స్ ను పోస్ట్ చేసింది. తన స్నేహితురాలు, డాక్టర్ మంజుల బర్త్ డే వేడుకకు సమంత హాజరైంది. డైరెక్టర్ నందినితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను షేర్ చేసిన సమంత.. ‘‘నీ లాంటి వ్యక్తి నాకు స్నేహితురాలిగా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. కష్టసమయంలోనే నిజమైన ఫ్రెండ్ అంటే ఎవరో తెలుస్తుందంటారు. మరి, నాకు నీ కన్నా నిజమైన ఫ్రెండ్ ఎవరున్నారు డాక్టర్! నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో తెలిసే ఉంటుంది.. హ్యాపీ బర్త్ డే’’ అని పోస్ట్ పెట్టింది.

  • Loading...

More Telugu News