'ల‌వ్ వాంటిటి' సాంగ్‌కు డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టిన పీవీ సింధు.. వీడియో వైర‌ల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ల‌వ్ వాంటిటి' సాంగ్‌కు డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టిన పీవీ సింధు.. వీడియో వైర‌ల్

pv sindhu dance goes viral
  • సంప్ర‌దాయ దుస్తులు వేసుకుని డ్యాన్స్
  • వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సింధు
  • ట్రెడిష‌న‌ల్‌, డ్యాన్స్‌, ల‌వ్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌లవ్ హ్యాష్‌ట్యాగ్‌లు జోడింపు
బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు సంప్ర‌దాయ దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పాప్ సింగ‌ర్ సీకే పాడిన‌ 'ల‌వ్ వాంటిటి' సాంగ్‌కు సింధు చిందులేసింది. కొన్ని రోజులుగా ఈ పాట ఇంట‌ర్నెట్‌లో బాగా వైర‌ల్ అవుతోంది.

కాంచీపురం లెహెంగాలో పీవీ సింధు ఈ పాప్ సాంగ్‌కు చేసిన డ్యాన్స్ అల‌రిస్తోంది. ఆమె డ్యాన్సును ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది చూశారు. ట్రెడిష‌న‌ల్‌, డ్యాన్స్‌, ల‌వ్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌లవ్ హ్యాష్‌ట్యాగ్‌ల‌ను సింధు జోడించింది. ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన తీరుపై ప్ర‌ముఖులు కూడా స్పందిస్తున్నారు.  

బ్యాడ్మింట‌న్‌తో బిజీగా ఉండే సింధు డ్యాన్స్‌ చేయడం అందరినీ ఆశ్చర్యానికి కూడా గురిచేస్తోంది. సింధు నిన్న‌ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప‌ద్మ భూష‌ణ్ అందుకున్న విష‌యం తెలిసిందే.
PV Sindhu
Viral Videos
Instagram

More Telugu News