Sharmila: అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్లపైనే తొలి సంతకం: షర్మిల

Sharmila says she will sign first on notifications when she got into power
  • ప్రజాప్రస్థానం పేరిట షర్మిల పాదయాత్ర
  • 20వ రోజుకు చేరిన పాదయాత్ర
  • ఎక్కడికక్కడ సమావేశాలతో ముందుకు సాగుతున్న షర్మిల
  • అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ట్విట్టర్ లో వెల్లడి
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల పాదయాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఎక్కడికక్కడ ప్రజలతో మాట-ముచ్చట పేరుతో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ షర్మిల ముందుకు సాగుతున్నారు.

తాజాగా ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లపైనే తొలి సంతకం చేస్తానని వెల్లడించారు. కుటుంబంలో అర్హత ఉన్నవారందరికీ పెన్షన్లు ఇస్తామని తెలిపారు. బాధితులందరికీ కరోనా బిల్లులు చెల్లిస్తామని ట్వీట్ చేశారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని, ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. సంక్షేమం, సమానత్వం, స్వయంసమృద్ధే తమ లక్ష్యమని షర్మిల ఉద్ఘాటించారు.
Sharmila
Praja Prasthanam
Padayatra
YSR Telangana Party

More Telugu News