టీ20 వరల్డ్ కప్ ను విజయంతో ముగించిన టీమిండియా
- నమీబియాపై 9 వికెట్ల తేడాతో విక్టరీ
- 15.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన భారత్
- రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అర్ధసెంచరీలు
- లీగ్ దశలో మూడు విజయాలు నమోదు చేసిన కోహ్లీ సేన
రోహిత్ శర్మ అవుట్ కావడంతో బరిలోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. గ్రూప్-2లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్... ఆపై వరుసగా ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లపై ఘనవిజయాలు నమోదు చేసింది. అయితే సమీకరణాలు సహకరించకపోవడంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కాగా, టీమిండియా కోచ్ గా రవిశాస్త్రికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్.
ఇక, టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ దశకు తెరలేచింది. నవంబరు 10న జరిగే తొలి సెమీస్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబరు 11న జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. నవంబరు 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.