ఆఫ్రికాలో ఘోర ప్రమాదం... సియర్రా లియోన్ లో చమురు ట్యాంకర్ పేలి 91 మంది మృతి
- లారీని ఢీకొట్టి రోడ్డుపై నిలిచిపోయిన ట్యాంకర్
- ట్యాంకర్ నుంచి చమురు లీక్
- సేకరించేందుకు ఎగబడిన ప్రజలు
- ఒక్కసారిగా పేలిపోయిన ట్యాంకర్
పేలుడు ధాటికి సమీపంలోని షాపులు, పాదచారులకు కూడా మంటలు అంటుకున్నాయి. మృతులు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. వారి శరీర భాగాలు విసిరేసినట్టుగా చెల్లాచెదురుగా పడ్డాయి. ఘటనా స్థలం బీభత్సంగా మారిపోయింది. ఈ ఘటనపై సియర్రా లియోన్ అధ్యక్షుడు జూలియన్ మాడా బియో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.