కార్తికేయ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు: తాన్య రవిచంద్రన్
- ఈ నెల 12న రానున్న 'రాజా విక్రమార్క'
- కార్తికేయ జోడీగా చేసిన తాన్య రవిచంద్రన్
- తెలుగులో తను చేసిన తొలి సినిమా ఇదే
- తప్పకుండా హిట్ అవుతుందంటున్న తాన్య
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "చెన్నైలో నేను పీజీ చేస్తున్న సమయంలోనే నాకు తమిళ సినిమాల నుంచి అవకాశాలు వచ్చాయి. ఒక సినిమా చేసి చూద్దామని అనుకున్న నేను, వరుసగా మూడు సినిమాలు చేశాను. ఆ తరువాత చదువును పూర్తిచేసి నటనను కంటిన్యూ చేస్తున్నాను.
దర్శకుడు శ్రీ సరిపల్లి చెన్నైకి వచ్చి నాకు ఈ కథ వినిపించాడు. కథలో నా పాత్ర నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాను. హోమ్ మినిష్టర్ కూతురిగా ఈ సినిమాలో కనిపిస్తాను. కార్తికేయ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు .. ఆయనతో కలిసి పనిచేయడం చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చింది.
