Andhra Pradesh: ఏపీలో తాజాగా 301 మందికి కరోనా నిర్ధారణ

AP Corona Media Report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 36,373 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 53, విశాఖ జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 39, పశ్చిమ గోదావరి జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 24 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం, అనంతపురం జిల్లాలలో 3 కేసుల చొప్పున గుర్తించారు.

అదే సమయంలో 367 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,67,556 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,49,338 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 3,830 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,388కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Report
Today Cases

More Telugu News