Tollywood: ‘యాక్షన్ బ్లాక్ బస్టర్’ అంటూ ‘శ్రీదేవి సోడా సెంటర్’పై చిత్ర యూనిట్ ఆసక్తికర ప్రకటన

Sridevi Soda Center To Be Streamed Exclusively On Zee 5 From Tomorrow
షార్ట్స్‌లో చూడండి
‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదలకు ముస్తాబైంది. రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ ‘జీ5’లో ఆ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్ర బృందం, జీ5 ఈ విషయాన్ని ప్రకటించాయి. సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా కరుణకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ‘జీ5’ ఎక్స్ క్లూజివ్ గా సినిమాను విడుదల చేస్తోంది.

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపే సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఓ చిన్న వీడియో గ్లింప్స్ నూ విడుదల చేసింది. ‘‘ఉత్కంఠభరితమైన యాక్షన్ ఘట్టాలతో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్ ‘శ్రీదేవి సోడా సెంటర్’ రేపట్నుంచి ‘జీ5’లో స్ట్రీమ్ అవుతుంది’’ అని తెలిపింది.
Go Back to Shorts
Tollywood
Sridevi Soda Center
Sudheer Babu
Zee 5

More Telugu News