16వ రౌండ్ లో కూడా ఈటలదే ఆధిక్యం

Etela Rajender leads in 16th round
హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల సరళి ఏకపక్షంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ తొలి నుంచి ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తున్నారు. 16వ రౌండ్ లో కూడా ఈటలే లీడ్ సాధించారు. 16వ రౌండ్ లో ఈటలకు 1,712 మెజార్టీ వచ్చింది.

ఈ రౌండ్ ముగిసేసరికి మొత్తం 13,255 ఓట్ల మెజార్టీతో ఈటల స్పష్టమైన ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో బీజేపీకి 74,175 ఓట్లు, టీఆర్ఎస్ కు 60,920 ఓట్లు వచ్చాయి. ఈటల గెలుపు దాదాపు ఖరారు కావడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది.
Go Back to Shorts
Etela Rajender
Huzurabad
Results

More Telugu News