Raghunandan Rao: ఈటల రాజేందర్ కు ఎంత మెజార్టీ వస్తుందో చెప్పిన రఘునందన్ రావు

Etela Rajender gets 25000 majority says Raghunandan Rao
  • ఈటల 25 వేల మెజార్టీతో గెలుస్తారు
  • హుజూరాబాద్ మండలంలో బీజేపీకి ఓట్లు రావడం కష్టమని ముందు భావించాం
  • కేసీఆర్ ను ప్రజలు నమ్మడం లేదు
హుజూరాబాద్ ఉపఎన్నికలో తమ అభ్యర్థి ఈటల రాజేందర్ 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అంచనా వేశారు. హూజూరాబాద్ మున్సిపాలిటీ, హుజూరాబాద్ మండలంలో బీజేపీకి ఓట్లు రావాలంటే కష్టమని తాము ముందుగా భావించామని... అయితే మండలానికి సంబంధించిన అన్ని రౌండ్లలో బీజేపీకి ఆధిక్యత వచ్చిందని చెప్పారు. మొత్తం 22 రౌండ్ల వరకు ఇదే ఆధిక్యత కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈటల విజయం విషయంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతే టీఆర్ఎస్ ఓటమికి కారణం కాబోతోందని అన్నారు. కేసీఆర్ ను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు.
Raghunandan Rao
Etela Rajender
BJP
Huzurabad

More Telugu News