BJP: పోలీస్ వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకున్నారు: బద్వేల్ బీజేపీ అభ్యర్థి పణతాల సురేశ్ ఆరోపణ

BJP Candidate Responds After Results Announced
  • బూత్ లలోకి చొరబడ్డారు
  • వేల కోట్లతో ఓట్లకు నోట్లిచ్చారు
  • బీజేపీకి జనం అండగా నిలిచారు
బద్వేల్ ఉప ఎన్నిక ఫలితాలపై బీజేపీ అభ్యర్థి పణతాల సురేశ్ స్పందించారు. దొంగ ఓట్లతో అధికార పార్టీ వైసీపీ విజయం సాధించిందని ఆయన ఆరోపించారు. బూతుల్లోకి చొరబడ్డారని, వేల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. డబ్బు పెట్టి ఓట్లను కొన్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు.

అంగన్ వాడీ కార్యకర్తల నుంచి సచివాలయ ఉద్యోగుల వరకు ఎవరినీ జగన్ ప్రభుత్వం వదలట్లేదని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారని, తమకు మద్దతుగా నిలిచారని అన్నారు. ఒక్క బద్వేల్ లోనే కాకుండా.. ఏపీ మొత్తం బీజేపీకి మద్దతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ అరాచక పాలనను అంతం చేయడానికి బద్వేల్ ఉప ఎన్నికే నాంది కాబోతోందని ఆయన అన్నారు.  
BJP
Andhra Pradesh
Badvel
Bi Poll
Panathala Suresh

More Telugu News