Vijay Sai Reddy: టీడీపీ నేత‌ల ప‌రుష ప‌దజాలంపై రాష్ట్ర‌ప‌తికి వైసీపీ ఎంపీల బృందం ఫిర్యాదు

All our MPs met President today vijaya sai
  • జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై, మా పార్టీపై ప‌రుష ప‌ద‌జాలం
  • చంద్ర‌బాబు నాయుడు, లోకేశ్, ప‌ట్టాభిపై ఫిర్యాదు
  • టీడీపీ శ్రేణులు మాట్లాడుతోన్న ప‌రుష‌ ప‌ద‌జాలంపై వివ‌ర‌ణ ఇచ్చాం
  • మీడియాకు తెలిపిన విజ‌య‌సాయిరెడ్డి
టీడీపీ నేత‌లు మాట్లాడుతోన్న భాష బాగోలేదంటూ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు వైసీపీ ఎంపీల‌ బృందం ఫిర్యాదు చేసింది. ఈ సంద‌ర్భంగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... 'ఈ రోజు మా ఎంపీలంద‌రం రాష్ట్ర‌ప‌తిని క‌లిశాం. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై, మా పార్టీపై చంద్ర‌బాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్, టీడీపీ నేత‌ ప‌ట్టాభితో పాటు టీడీపీ శ్రేణులు మాట్లాడుతోన్న ప‌రుష‌ ప‌ద‌జాలంపై ఫిర్యాదు చేశాం. టీడీపీ గుర్తింపును ర‌ద్దు చేయాల‌ని మేము రాష్ట్ర‌ప‌తిని కోరాము' అని విజ‌య‌సాయిరెడ్డి వివ‌రించారు.
Vijay Sai Reddy
YSRCP
Chandrababu

More Telugu News