Raviteja: దీపావళికి 'ఖిలాడి' సెకండ్ సింగిల్!

Khiladi second single will release in Deepavali
  • రవితేజ తాజా చిత్రంగా 'ఖిలాడి'
  • ఆయన సరసన ఇద్దరు భామలు
  • కీలకమైన పాత్రలో అర్జున్
  • త్వరలోనే రానున్న రిలీజ్ డేట్  
రవితేజ ఈ ఏడాది 'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత సినిమాగా ఆయన 'ఖిలాడి' చేశాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కూడా ఆయన ఈ ఏడాదిలో థియేటర్లకు వచ్చేలా చేయాలనుకున్నాడు .. కానీ కుదరడం లేదు.

ప్రస్తుతం ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది .. రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలోనే చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా, ఈ నెల 4వ తేదీన ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు. ఫస్టు సింగిల్ కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

అందువలన సహజంగానే దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సెకండ్ సింగిల్ పై అంతా ఆసక్తితో ఉన్నారు. రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి సందడి చేయనున్నారు. ఇక అర్జున్ - ఉన్ని ముకుందన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాతో రవితేజ మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Raviteja
Meenakshi Chaudary
Dimple Hayathi
Arjun

More Telugu News